TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు సామాజిక వర్గాల సమీకరణాలపై దృష్టి సారించాయి. అయితే ప్రధానంగా అందరి దృష్టి మైనార్టీ వర్గాలపైనే ఉంది. పాతబస్తీ తర్వాత అధిక సంఖ్యలో మైనార్టీ ఓట్లు ఉన్న నియోజకవర్గం జూబ్లీహిల్స్ మాత్రమే. ఇక్కడ మైనార్టీలు ఎటువైపు ఉంటే.. వాళ్లదే గెలుపు. అయితే గత ఎన్నికల్లో ముస్లింలు BRS వైపు నిలబడగా.. ఈసారి ఎటువైపు ఉంటారో వేచి చూడాలి.