»5 Amazing No Oil Recipes Perfect For Your Weight Loss Journey
Health Tips: చుక్క ఆయిల్ లేకుండా సూపర్ యమ్మీ ఫుడ్స్..బరువు తగ్గడం సులువు!
చాలా మంది బరువు తగ్గడం అంటే తిండి మానేయడం లేదంటే, టేస్ట్ లేని ఫుడ్ తినడం అని అనుకుంటూ ఉంటారు. కానీ, అద్భుతంగా రుచికరమైన ఆహారం తీసుకుంటూ కూడా సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు మనం సులభంగా బరువు తగ్గేందుకు ఉపయోగపడే, అదేవిధంగా రుచికరమైన ఐదు యమ్మీ ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం.
1.వెజిటేబుల్ పులావ్:
వెజిటేబుల్ పులావ్ ఎంత కమ్మగా, రుచిగా ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు, దీనిని మీకు నచ్చిన కూరగాయలు జత చేసి వండుకోవచ్చు. అయితే, దీనిని తయారు చేసే సమయంలో నూనెకి బదులుగా కప్పు పాలను వాడండి. నూనెకి బదులు పాలు వేసి, మిగిలిన ప్రాసెస్ మొత్తం మీకు ఆల్రెడీ తెలిసినదే ఫాలో అయితే సరిపోతుంది. ఇది మీకు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. రుచి కూడా బాగుంటుంది. పాలు నచ్చనివారు, పాల మీద మీగడ వేసి కూడా తయారు చేసుకోవచ్చు.
2.అప్పం:
అప్పం, ఒక రుచికరమైన దక్షిణ భారతీయ రుచికరమైనది, ఇది బియ్యం , కొబ్బరి పాలతో తయారు చేసే పాన్కేక్ లాంటిది. దీనిని తయారు చేయడం చాలా సులువు. దీనిని తయారు చేయడానికి కూడా నూనె అవసరం లేదు. మీరు కమ్మగా తినొచ్చు. సులభంగా బరువు కూడా తగ్గొచ్చు.
3.చనా కబాబ్:
ఇది ప్రోటీన్ కి ప్రసిద్ధి చెందింది, ఇది మీ బరువు తగ్గించే ఆహారంలో కీలకంగా ఉపయోగపడుతుంది. దీనిని కూడా నూనె లేకుండా తయారు చేయవచ్చు. ఈ కబాబ్‌లను చట్నీతో ఆస్వాదించండి.
4.సెమెలినా షార్ట్ బ్రెడ్:
సెమోలినా షార్ట్బ్రెడ్ క్రిస్పీ గా చాలా రుచిగా ఉంటుంది. అదేంటి? దీనిని నూనెలో డీప్ ఫ్రై చేసి తింటారు కదా అని అనుకోవచ్చు. అయితే, దీనిని నూనె లేకుండా ఆవిరి మీద ఉడికించి కూడా తినొచ్చు. ఇది ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. రుచిని అందిస్తుంది.
5.ఉరాద్ దాల్:
ఉరాద్ దాల్, ప్రొటీన్, ఫైబర్‌తో కూడిన ఒక ప్రసిద్ధ పప్పు వంటకం, ఇప్పుడు రుచిలో రాజీ పడకుండా బరువు తగ్గడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఈ రుచికరమైన ఉరద్ దాల్ని రోటీ లేదా అన్నంతో కలిపి లంచ్ లేదా డిన్నర్‌తో ఆస్వాదించండి