AP: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా మొత్తం 38 అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. ఇందులో భాగంగా 14 ప్రాజెక్టులకు సంబంధించి SIPB ఆమోదించిన రూ.19,391 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అలాగే రాజధానిలో భూకేటాంపులపై నిర్ణయం తీసుకోనున్నారు.