AP: ఈరోజు మంత్రి వర్గం సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గం.లకు కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ముఖ్యంగా సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదించిన రూ. 24276 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే పీడీఎస్ బియ్యం తరలింపు విషయంపై, వివిధ సంస్థల పెట్టుబడుల అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.