TG: అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క నిజం కూడా చెప్పలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అబద్ధాలు చెప్పడంలో రేవంత్ గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి ఎక్కారని, రెండు గంటల ప్రసంగంలో రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో చెప్పలేదని ఆరోపించారు. రైతులు రూ.2 లక్షల పైన ఉన్న మొత్తం చెల్లించండి.. రుణమాఫీ వస్తుందని చెప్పారని, సీఎం మాటలు నమ్మి ఎంతోమంది రూ.2 లక్షలపైన ఉన్న అప్పు చెల్లించారని విమర్శించారు.