అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తనకు నచ్చిన భారతీయ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024లో తనకు నచ్చిన చిత్రాలు, మ్యూజిక్ ఆల్బమ్స్, పుస్తకాలను ఉద్దేశించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పోస్ట్ పెట్టారు. ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’ తనకు బాగా నచ్చిన చిత్రమని ప్రకటించారు. కాగా.. భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా దీనికి దర్శకత్వం వహించారు.