భారత్లో హ్యుందాయ్ క్రెటా EV లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ 2025 సంవత్సరంలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో మొదటి రోజున ప్రారంభిస్తారు. జనవరి 17న హ్యుందాయ్ క్రెటా EV భారత్లో లాంచ్ కానుంది. క్రెటా EVలో 45kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులో అమర్చిన బ్యాటరీ ప్యాక్ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 400 కి.మీ. కంటే ఎక్కువ రేంజ్ ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది.