దొండకాయలను నిత్యం తింటే షుగర్ లెవల్స్ తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. కిడ్నీ స్టోన్లు ఉన్నవారు దొండకాయలను తింటే ఫలితం ఉంటుంది. మూత్రాశయ వ్యాధులు తగ్గుతాయి. దొండ ఆకులను పేస్టులా చేసి వాటితో ట్యాబ్లెట్లను తయారు చేసి వాడితే బ్యాక్టీరియాతో ఏర్పడే చర్మ సమస్యలు తగ్గుతాయి.