TG: మూసీ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, ప్రణాళిక, అమలును వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సబ్‌కమిటీ ఛైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవహరించనుండగా, సభ్యులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులను నియమించింది.