AP: హోంమంత్రి అనితపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రూ. 70 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఎలా పడితే అలా పిటిషన్ వేయడం సరికాదని కోర్టు తేల్చి చెప్పింది. ఫిర్యాదుదారునితో రాజీ కుదిరినందున కేసు ప్రొసీడింగ్స్ కొట్టేయాలని వేసిన పిటిషన్పై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజీలో ఏం కుదిరింది, సమస్యకు ఏం పరిష్కారం చేశారో పూర్తి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా వేసింది.