TG: లుంబినీ పార్క్, గోకుల్ చాట్ పేలుళ్ల కేసు దోషులు హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టు వేసిన ఉరిశిక్ష రద్దు చేయాలని కోరగా.. వారి మానసిక ప్రవర్తన, ఆరోగ్య పరిస్థితి పరిశీలించేందుకు కోర్టు ఇద్దరు ‘మిటిగేటర్ల’ను నియమించింది. అయితే కేసును వేరే బెంచ్‌కు మార్చాలన్న దోషుల అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.