జమిలి బిల్లును JPCకి పంపేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇవాళ JPC ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రవేశపట్టనున్నారు. JPCకి లోక్సభ నుంచి 21 మంది ఎంపీలను నియమించారు. అలాగే రాజ్యసభ నుంచి 10 సభ్యులను ప్రతిపాదించనున్నారు. రాజ్యసభ సభ్యులను నియమించాక కమిటీ ఛైర్మన్ పేరును కేంద్రం ప్రకటించనుంది. JPC సభ్యులుగా ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, సుఖదేవ్ భగత్, ఏపీ నుంచి ఎంపీలు సీ.ఎం. రమేశ్, బాలశౌరి, హరీశ్ బాలయోగీ తదితరులు ఉన్నారు.