TG: మంచు ఫ్యామిలీలో హైడ్రామా కొనసాగుతోంది. హైదరాబాద్లోని డీజీపీ ఆఫీస్కు వెళ్లిన మంచు మనోజ్ భార్యతో కలిసి శివధర్ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని కంప్లైంట్ చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలను డీజీపీకి సమర్పించారు. అంతేకాకుండా గత ఆదివారం పది మంది వ్యక్తులు.. తనపై బెదిరింపులకు దిగారని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భార్యను, పిల్లలను చంపేస్తామని బెదిరింపులకు దిగారని కంప్లైంట్లో పేర్కొన్నారు.