రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు బయల్దేరారు. ఈ సాయంత్రం ఆయన ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భారత్-రష్యా మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. దాదాపు 15 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయని రష్యా న్యూస్ ఏజెన్సీ ‘టాస్’ (TASS) వెల్లడించింది. రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేలా పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.