ఉత్తర అమెరికాలో క్రిస్మస్ సీజన్లో వెర్మిలియన్ పక్షులు సందడి చేస్తుంటాయి. వీటిని క్రిస్మస్ పక్షులని కూడా అంటారు. ఇవి ఎరుపు రంగులో ఆకర్శనీయంగా ఉంటాయి. వీటి కిలకిలారావాలు పాటల మాదిరిగా వినిపిస్తాయి. అవి భూమిపైకి దిగి పరిగెత్తేటప్పుడు పాటలు పాడుతాయట. ఇవి 22 రకాలుగా సౌండ్స్ చేస్తాయట. ఈ పక్షులు జీవితాంతం ఒక భాగస్వామితోనే ఉంటాయి. ప్రతి సంవత్సరం తమ ఈకలను తొలగిస్తాయి.