ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌కు సంబంధించి బ్రిటన్ మీడియా సంస్థ ‘ది గార్డియన్’ కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్స్ వేదిక ఎటువంటి పోస్టులు చేయబోమని ప్రకటించింది. దీనిలో జాత్యహంకారం, కుట్రలతోపాటు కలవరపరిచే అంశాలు కనిపిస్తున్నాయని.. అందుకే ఈ వేదికకు దూరంగా ఉండనున్నట్లు చెప్పింది. కాగా.. ఈ సంస్థకు ఎక్స్‌లో 1.07 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీనిపై ఎక్స్ అధినేత మస్క్ స్పందిస్తూ.. అవన్నీ అసంబద్ధమైనవన్నారు.