300 migrants have gone missing in the Atlantic Ocean
ప్రతిసంవత్సరం ఒక నగరం నుంచి మరో నగరానికి వలసలు( Migrants) వేళ్లడం సాధారణ విషయమే. అంతే సాధారణంగా బయలు దేరిన వలస కార్మికులు వారి గమ్యస్థానాన్ని చేరుకోలేదు. తాజాగా మూడు పడవల్లో వెళ్తున్న 300 మంది వలసదారులు అట్లాంటిక్ మహా సముద్రంలో(Atlantic Ocean) అదృశ్యమయ్యారు. 15 రోజుల క్రితం వీరంతా సెనెగల్ నుంచి స్పెయిన్లోని కానరీ ఐలాండ్స్(Senegal to Spain’s Canary Islands)కు పడవల్లో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వలసదారులకు సాయం చేసే వాకింగ్ బోర్డర్స్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఒక బోటులో 200 మంది, ఒకదాంట్లో 65 మంది, మరో దాంట్లో 60 మంది ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అదృశ్యమైన వారు ఏమయ్యారో తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఆఫ్రికా నుంచి కానరీ ఐలండ్స్కు వలసదారులు తరలిపోవడం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారింది. మరీ ముఖ్యంగా వేసవి కాలంలో ఈ వలసలు మరింత ఎక్కువగా ఉంటోంది. గతేడాది 22 మంది చిన్నారులు సహా 559 మంది కానరీ ఐలాండ్స్కు వెళ్లేందుకు ప్రయత్నించినట్టు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) తెలిపింది. ఇలా వెళ్తూ గతేడాది 1,784 మంది వలసదారులు మరణించినట్టు వాకింగ్ బోర్డర్స్ ఓ నివేదికలో తెలిపింది. గతేడాది కానరీ ఐలాండ్స్కు 15,682 మంది వలసలుగా వచ్చారని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 30 శాతం తగ్గిందని స్పెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది.