ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ ఈనెల 20న కొత్త చేతక్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది. సింగిల్ ఛార్జ్‌లో 123 కిలోమీటర్ల నుంచి 137 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం బజాజ్ చేతక్ ధరలు రూ.96,000-రూ.1,29,000 (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఇక కొత్త ఈవీ ధరలు కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ హ్యండ్లింగ్, రైడ్ నాణ్యత మరింత మెరుగ్గా ఉండనుంది.