AP: వైఎస్ జగన్ విజయవాడ పర్యటనలో భాగంగా ఓ చిన్నారికి ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే ఆ పాప తనకు అమ్మఒడి రావటం లేదని ఆవేదన వ్యక్తం చేసి, స్కూలుకు వెళ్లటం లేదని చెప్పింది. కాగా.. ఆ పాప పేరు దేవికా రెడ్డి అని, ఆమె తండ్రికి బంగారం షాపు ఉందని తెలుస్తోంది. ఆమె ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లో ఎక్కువ ఖర్చు పెట్టి చదువుతున్నట్లు నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది.