ఆఫ్రికా దేశం కెన్యాలో విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడి 21 మంది మృతి చెందగా.. 30 మందికి పైగా గల్లంతయ్యారు. దక్షిణ కెన్యా ప్రాంతంలోని మారాక్వెట్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడ్డాయని దేశ అంతర్గత వ్యవహరాల మంత్రి వెల్లడించారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.