దైవ దర్శనం కోసం తమిళనాడులోని రామేశ్వరం వెళ్లిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఆలయ ఆచారాల్లో భాగంగా అగ్నితీర్థం వద్ద సముద్ర స్నానం చేసి.. దుస్తులు మార్చుకోవడానికి ఓ ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్లింది. అందులో సీక్రెట్ కెమెరాను గుర్తించిన ఆమె.. కుటుంబసభ్యులు, ఆలయ అధికారులు చెప్పింది. ఈ ఘటనలో పోలీసులు కెమెరాలను స్వాధీనం చేసుకుని బూత్ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు.