భారత్‌ను రెచ్చగొట్టేలా పాకిస్తాన్ మరోసారి వ్యాఖ్యలు చేసింది. రష్యాలోని పాక్ రాయబారి మహమ్మద్ ఖలీద్ జమాలీ భారత్‌పై అణు బెదిరింపులకు పాల్పడ్డారు. భారత్ కచ్చితంగా దాడులు చేయబోతున్నట్లు తమకు సమాచారం ఉందని పేర్కొన్నారు. భారత్ దాడి చేస్తే ప్రతిదాడికి తాము సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే అణ్వాయుధాలతో తమ పూర్తి శక్తిని ఉపయోగిస్తామని హెచ్చరించారు.