కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వం కూచిపూడి గ్రామాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరచడంతో పాటు ఆదాయ వనరులను పెంపొందించేందుకు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్(ఆర్జీఎస్ఏ) పథకం ద్వారా కృషి చేస్తున్నారు. రూ.5 కోట్ల నిధులను సమకూర్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు. కూచిపూడిలో గురుశిష్య పరంపర కొనసాగించేలా వారసత్వ కుటుంబాలను ప్రోత్సహించాలన్నారు.