VZM: ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత DSC శిక్షణను గిరిజన యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.శ్రీనివాసరావు కోరారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. జిల్లాలో 93మంది అభ్యర్థులను ఆన్లైన్ ద్వారా ఎంపిక చేసి జిల్లా కేంద్రంలో 3 నెలల పాటు ఉచిత శిక్షణ అందిస్తున్నామన్నారు.