GNTR: మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను నేరుగా మంత్రికి విన్నవించుకోవచ్చు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య వచ్చిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని టీడీపీ కార్యాలయం పేర్కొంది.