ATP: గుంతకల్లులో ఉప్పర, సాగరకుల ఆరాధ్య దేవుడు, మూలపురుషుడు మహర్షి భగీరథ జయంతిని ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. టీడీపీ మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, కూటమి నాయకులతో కలిసి మహర్షి భగీరథ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆకాశం నుంచి గంగను నేలకు దింపిన గొప్ప మహర్షి భగీరథుడని పేర్కొన్నారు.