HYD: మెహదీపట్నం సిగ్నల్ వద్ద వాహనదారులు యథేచ్ఛగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. సిగ్నల్ పడినా ఆగకుండా వెళ్లిపోతున్నారు. ఇలా చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. రూల్స్ పాటించాలని చెబుతున్నారు.