కృష్ణా: జిల్లాలో స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఖాళీల వివరాలను అధికారులు వెల్లడించారు. సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగు: 1, హిందీ: 1, ఆంగ్లం: 3, గణితం: 1, భౌతిక శాస్త్రం: 1, జీవశాస్త్రం: 4, సాంఘిక శాస్త్రం: 4, శారీరక విద్య: 3, ఎస్జీటీ: 13 చొప్పున మొత్తం 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు.