AP: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి ఇచ్చిన రూ.2,685కోట్ల సబ్సిడీని ప్రభుత్వం ప్రజలనుంచే వసూలు చేస్తోందని వైసీపీ విమర్శించింది. ప్రభుత్వం ఎడమ చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాక్కుంటుందని ఆరోపిస్తోంది. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో నేటి నుంచి ప్రజలపై రూ.17,072 కోట్లు భారం మోపుతున్నారంటోది. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తున్నామంటూ.. 20 సిలిండర్ల డబ్బుల్ని సర్కార్ వసూలు చేస్తోందని మండిపడింది.