తమ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంగానది నీరు స్నానం చేయటానికి పనికిరాదని బీహార్ ఆర్థిక సర్వే 2024-25 వెల్లడించింది. మానవ మలంలో కనిపించే మల కోలిఫాం అనే బ్యాక్టీరియా నదిలో అధిక స్థాయిలో ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ బ్యాక్టీరియా ప్రధానంగా నగరాల నుండి వచ్చే మురుగునీరు, ఇతర గృహ వ్యర్థ జలాలను నదీలోకి పంపించడంతో వ్యాప్తి చెందుతున్నట్లు ఈ సర్వే తెలిపింది.