TG: సంక్రాంతి నుంచి రైతుభరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. గతంలో ధరణిలో నమోదైన భూములకు రైతుభరోసా చెల్లించారని అన్నారు. ‘రైతు బంధు కింద ఇప్పటివరకు రూ.80,453 కోట్లు ఇచ్చారు. 2018 నుంచి పంటల సర్వే వ్యవసాయ శాఖ బాధ్యతగా మారింది. ఏఈవోలు యాప్ల సాయంతో పంటల నగదు సర్వే ప్రారంభించారు. సంక్రాంతి నుంచి రైతుభరోసా నిధులు విడుదల చేస్తాం’ అని పేర్కొన్నారు.