GDWL: యూరియా కొరతపై జిల్లా కేంద్రంలో రైతులు చేపట్టిన నిరసనపై ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అధికారులు స్పందించారు. అధికారులు జిల్లాకు 22 టన్నుల యూరియా సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు తమ నిరసనను విరమించుకున్నారని మాజీ పీఏసీఎస్ ఛైర్మన్ సుభాన్ తెలిపారు. అలాగే, కేటీ దొడ్డి మండలం పాతపాలెంకు 2 టన్నుల యూరియాను అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు.