నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తరహాలో.. ప్రసారభారతి ఓటీటీని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నెల 20న ప్రసారభారతి ఓటీటీని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు ప్రకటించారు. ఈ ఓటీటీ గేమ్‌ఛేంజర్‌గా మారనుందని పేర్కొన్నారు. దూరదర్శన్ ఫ్రీ డిష్‌లో అందుబాటులో ఉన్న 60 చానళ్లు.. ఇకపై ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.