ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఇవాళ హరిద్వార్‌లోని పతంజలి యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవానికి రాష్ట్రపతి హాజరవుతారు. రేపు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. అలాగే, ఎల్లుండి నీమ్ కరోలి బాబా ఆశ్రమానికి ద్రౌపది ముర్మ వెళ్లనున్నారు. రాష్ట్రపతి పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేశారు.