కువైట్లో ప్రధాని మోదీ ఇవాళ రెండో రోజు పర్యటించనున్నారు. 43 ఏళ్లలో భారత ప్రధాని కువైట్లో పర్యటించడం మొదటిసారి. రక్షణ, వాణిజ్యంతోపాటు కీలక రంగాల్లో భారత్-కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చేయనున్నారు. అలాగే, పలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. 1981లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కువైట్లో పర్యటించారు. ఆ తర్వాత కువైట్లో అడుగుపెట్టిన మొదటి ప్రధానిగా మోదీ రికార్డుకెక్కారు.