రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి తాను ఆర్ఎస్ఎస్ వాదినేనని వెల్లడించారు. స్కూల్లో ఉన్నప్పటి నుంచే తనపై వివేకానందుడి బోధనల ప్రభావం పడిందన్నారు. జీవితం అంటే బ్రతకడం కాదని, సమాజానికి మేలు చేయాలనే తపన ఆర్ఎస్ఎస్ మూలంగానే తనలో కలిగిందన్నారు. సమాజ సేవ కోసం పని చేస్తున్న ఆర్ఎస్ఎస్ను నేడు సమాజం తప్పుగా అర్థం చేసుకుంటుందన్నారు.