TG: నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా భావి భారత పౌరుల అభివృద్దికి కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రేపు బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ప్రకటన విడుదల చేశారు. అలాగే భావి భారత పౌరులుగా పిల్లలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పాఠశాల విద్యలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టిందని అన్నారు. బడుగు, బలహీన వర్గాల విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.