ఒత్తిడి పరిష్కార మార్గాలనేకం.. వాటిలో సమయాన్ని, ధనాన్ని తెలివిగా ఉపయోగించడం ఒకటి. ఈ పద్ధతి 90 శాతం ప్రజల ఒత్తిడిని దూరం చేస్తుందనడంలో సందేహం లేదు. సమయం, ధనం రెండూ చాలా విలువైనవి. వాటి విషయంలో పొదుపుగా ఉండాలి. డబ్బును పెట్టుబడి పెడితే రాబడులొస్తాయి. కాలాన్ని పెట్టుబడిగా పెట్టేవాళ్లు గొప్పవారిగా ఎదుగుతారు.