TG: సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘ఈ నెల 4న పుష్ప-2 విడుదలవుతుందని సంధ్య థియేటర్ వాళ్లు ఈ నెల 2న చిక్కడపల్లి పీఎస్లో దరఖాస్తు చేశారు. కానీ అందులో హీరో, హీరోయిన్ వస్తారని పేర్కొనలేదు. థియేటర్ వద్దకు హీరో రావడంతో.. ప్రజలు ఒక్కసారిగా తరలివచ్చారు. దీంతో పరిస్థితి కంట్రోల్ కాలేదు. ఈ నేపథ్యంలో ఓ తల్లి చనిపోయింది’ అని తెలిపారు.