TG: సంధ్య థియేటర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు. ఇకపై సినిమా విడుదల ముందురోజు ఎలాంటి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని చెప్పారు. టికెట్ల రేట్లను పెంచేందుకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. పరిహారం ఇస్తామన్న హామీని అల్లు అర్జున్ నిలబెట్టుకోలేదన్నారు.