నార్కో-టెర్రర్ కింగ్ పిన్ మహ్మద్ అర్షద్‌ను జమ్మూకాశ్మీర్ రాష్ట్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. ముంబై విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకుంది. పూంజ్ జిల్లా తహసీల్ హవేలికి చెందిన అర్షద్.. 2023 నుంచి అజ్ఞాతంలో ఉండి పాకిస్తాన్‌కు చెందిన హ్యాండ్లర్‌తో కలిసి సౌది అరేబియా నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు.