AP: మొక్కజొన్న కొనుగోళ్లలో కేంద్రం ప్రత్యేక చొరవ చూపాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. పీఎం-ఆశా కింద రైతులకు నేరుగా ధరల వ్యత్యాసం చెల్లించాలని, ఈ పథకాన్ని జూన్ 2026 వరకు పొడిగించాలని పేర్కొన్నారు. దీనికి అయ్యే 100% నిధులను కేంద్రమే భరించాలని అభ్యర్థించారు. నాఫెడ్, ఏపీ మార్క్ఫెడ్ సమన్వయంతో కొనుగోళ్లు సాగేలా అనుమతి ఇవ్వాలని చంద్రబాబు స్పష్టం చేశారు.