TG: గురుకుల విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని మంత్రి సీతక్క ఉపాధ్యాయులకు సూచించారు. వరంగల్ కొత్తగూడ మండల కేంద్రంలో క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం గాంధీనగర్ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి బోధన ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి ఆట పాటలతో డాన్సులు చేశారు.