దక్షిణ లెబనాన్‌తో పాటు బీరుట్పైనా తాజాగా ఇజ్రాయెల్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులను సదరన్ కమాండ్‌కు నేతృత్వం వహిస్తున్న సీనియర్ హెజ్బొల్లా కమాండర్ అలీ కరాకీ లక్ష్యంగా చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఈ దాడిలో కరాకీ చనిపోయారా లేదా అన్న విషయం తెలియరాలేదు. ఆయన వివరాలు తెలియటం లేదని హెజ్బొల్లా వర్గాలూ తెలిపాయి.