పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) ‘హరిహర వీరమల్లు(Harihara veeramallu)’ ఏ ముహూర్తాన మొదలైందో కాని.. షూటింగ్ మాత్రం కంప్లీట్ అవడం లేదు. ముందుగా అనుకున్న దాని ప్రకారం అయితే.. ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని.. ఈ పాటికీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ హరిహర వీరమల్లు మాత్రం కంప్లీట్ అవడం లేదు. పవన్ రాజకీయం కారణంగా రోజు రోజుకి డిలే అవుతునే ఉంది. అందుకే పవన్ డేట్స్ ఇచ్చినప్పుడల్లా షూటింగ్ చేస్తూ వస్తున్నాడు దర్శకుడు క్రిష్. అయితే ఎట్టకేలకు ఇటీవలె తిరిగి ‘హరిహర వీరమల్లు’ పట్టాలెక్కడంతో కాస్త ఖుషీ అవుతున్నారు మెగాభిమానులు.
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ షెడ్యూల్లో ఇంకా పవన్ జాయిన్ అవలేదట. కానీ షూటింగ్ మాత్రం జెట్ స్పీడ్‌తో జరుగుతున్నట్టు తెలుస్తోంది. పవన్ లేకుండా షూటింగ్ ఎలా సాధ్యమనే సందేహం రావచ్చు.. అది కూడా పవన్‌కు సంబంధించిన కీలక సీన్స్ కావడం.. దాదాపుగా అసాధ్యం. కానీ పవన్ డూప్‌తోనే మ్యానేజ్ చేస్తున్నాడట క్రిష్. మామూలుగా కొన్ని రిస్కీ స్టంట్స్ ఉన్నప్పుడు మాత్రమే.. హీరోలకు బదులు తమ డూప్లతో షూట్ చేస్తుంటారు.
కానీ హరిహర వీరమల్లు లేటెస్ట్ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తిగా డూప్‌తోనే కానిస్తున్నారట. పవన్‌కు సంబంధించిన కొన్ని క్లోజప్ షాట్స్ తప్పించి.. మిగతా లాంగ్ షాట్స్ మొత్తం డూప్‌తోనే షూట్ చేస్తున్నారట. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే ఇంతకుముందు చాలా సినిమాల్లో డూప్‌తో షూట్ చేసిన సందర్భాలున్నాయి. కాకపోతే ఆడియెన్స్‌కు అది తెలియకుండా చేయడమే సినిమా ట్రిక్. కాబట్టి హరిహర వీరమల్లులో డూప్‌ను గుర్తు పట్టాడానికి ఛాన్సే లేదని చెప్పొచ్చు.