TG: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఈడీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ విషయంపై అద్దంకి దయాకర్ స్పందించారు. బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే ఈడీ దాడులు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా భయపెట్టాలని ఎంతగానో ప్రయత్నించారని తెలిపారు. బీజేపీ చేయిస్తున్న ఈడీ దాడులకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు.