TG: స్వాతంత్ర్యం తర్వాత ఉమ్మడి ఏపీలో సాగునీటి ప్రాజెక్టులకు రూప కల్పన జరిగిందని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. నెహ్రూ హయాంలో నాగార్జున, శ్రీశైలం ప్రాజెక్టులు నిర్మించారని గుర్తు చేశారు. కృష్ణా జలాలపై ఉత్తమ్, సీఎం రేవంత్ వాస్తవాలు మాట్లాడారని చెప్పారు. కాళేశ్వరం కట్టాకే రాష్ట్రానికి నీళ్లు వచ్చినట్లు హరీష్ మాట్లాడారని విమర్శించారు.