AP: మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై స్వామీజీలు స్పందించారు. జగన్ ఈ విధంగా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. స్వామి వారి కరుణ ఎవరిపై ఉంటుందో వారే తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని తెలిపారు. వైసీపీ శ్రేణులు దేవాలయాల్లో పూజలు చేస్తే జగన్ మాత్రం చోద్యం చూస్తారని మండిపడ్డారు. జగన్ తిరుమలకు రావడం ప్రతి ఒక్క హిందువుకు ఆవేదన కలిగించిందన్నారు. డిక్లరేషన్‌పై సంతకం పెడితేనే జగన్ కొండపైకి రావడం వీలవుతుందని స్పష్టం చేశారు.