HNK: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో అంధులకు(బ్రెయిలీ లిపి) వారికి కంప్యూటర్, బుక్స్ సెక్షన్స్ను గ్రంథాలయ ఛైర్మన్ అజీజ్ ఖాన్ ప్రారంభించారు. జిల్లాలోని అంధులకు కంప్యూటర్ నైపుణ్యం కలిగి ఉండాలనే ఉద్దేశంతో సెక్షన్స్ ప్రారంభించామని, అంధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ కార్యదర్శి శశిజాదేవి, తదితరులు పాల్గొన్నారు.