తమపై అవినీతి ఆరోపణలు చేసిన తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై (BJP state president K Annamalai) పైన కచ్చితంగా పరువు నష్టం కేసు వేస్తానని, మేం అతనిని ఎలా వదిలేస్తామన్నారు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ( State Sports Minister Udhayanidhi Stalin). ఆయన చేసిన ఆరోపణల మీద మీరు కోర్టుకు వెళ్తారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఉదయనిధి పైవిధంగా స్పందించారు. చెన్నై నగరంలో (chennai city) ఓ కార్యక్రమం అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అన్నామలై ఇటీవల విడుదల చేసిన డీఎంకే ఫైల్స్ (dmk files) పైన మీడియా ప్రశ్నలు అడిగింది. దీనికి ఉదయనిధి మాట్లాడుతూ… మీరు నన్ను చాలా ప్రశ్నలు అడుగుతున్నారు… అతనిని ఒక్కటైనా అడిగారా… స్కూల్ ట్యూషన్ చెబుతున్నట్లుగా మాట్లాడాడు.. మీ మీడియా ప్రతినిధులు కూడా అక్కడ హాజరై.. ఆయన చెప్పింది విని వస్తున్నారు అన్నాడు. అతనిపై పరువు నష్టం దావా మాత్రం వేస్తామని చెప్పారు. అయితే తన డీఎంకే ఫైల్స్ పైన (dmk files) మీడియా అడిగే ప్రశ్నలకు ఈ నెల 20, 21 వ తేదీల్లో అందుబాటులో ఉంటానని అన్నామలై ముందే ప్రకటించారు.
ఏప్రిల్ 14న తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై… ((BJP state president K Annamalai) డీఎంకే ఫైల్స్ (dmk files) పేరిట డీఎంకే అసెట్ లిస్ట్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. డీఎంకే మంత్రుల ఆస్తులను ప్రస్తావిస్తూ పలు సమాచారాన్ని విడుదల చేశారు. డీఎంకే ఎంపీలు కనిమొళి, జగద్రత్సకన్, దయానిధి మారన్, డీఆర్ బాలు, కతిర్ ఆనంద్, డీఎంకే మంత్రులు పొన్ముడి, కేఎన్ నెహ్రూ, ఏవీ వేలు పేర్లు అందులో ఉన్నాయి. అన్నామలై పైన డీఎంకే ఇప్పటికే రూ.500 కోట్ల పరువు నష్టం వేయడంతో పాటు క్షమాపణలు డిమాండ్ చేసింది. దీనిపై ఆయన కూడా ధీటుగానే స్పందించారు. మరి తన పైన, తన పార్టీ బీజేపీ పైన చేసిన వ్యాఖ్యలకు వారిపై కూడా రూ.501 పరువు నష్టం దావా వేస్తున్నట్లు చెప్పారు.